Wednesday, May 23, 2012

కంప్యూటర్ బ్లాగ్ లు

 కంప్యూటర్ బ్లాగ్ లు
2007 లో కంప్యూటర్ ఎరా 

తెలుగులో కంప్యూటర్ గురించి చెప్పాలంటే శ్రీధర్ గారు ఒక్కరే ఉన్నారు అనడం లో అతిశయోక్తి కాదేమో .   కంప్యూటర్ అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా శ్రీధర్ గారు చెప్పే  విషయాలను  ఫాలో  అయితే  కంప్యూటర్  తో  ఆట ఆడుకోవడం పెద్ద కస్తమేమి కాదు .  ఇంటర్ నెట్ లో  మనకి ఎదురైయే ఎన్నో సమస్యలకి శ్రీధర్ గారు  ఎప్పడికప్పుడు  వీడియో లను  అప్లోడ్ చేస్తూ మరీ వివరిస్తుంటారు .  మీరు ఇంకా  శ్రీధర్ గారి వెబ్సైటు చూడకపోతే కంప్యూటర్ గురించి ఇంటర్నెట్ తెల్సుకోవాల్సిన విషయాలను మీరు మిస్ అవుతున్నాట్టే . 
http://computerera.co.in/blog/


కంప్యూటర్ బ్లాగ్ లలో మరో బ్లాగ్ సాయి గారిది . నాకు  శ్రీధర్ గారు  అంటే  అభిమానం అని చెప్తారాయన .  తన బ్లాగ్ గురించి పరిచయం చేస్కుంటూ నా మనసు....... నా మదిలో మెదిలే ఆలోచనలకు అక్షరరూపం..  సాయి గారు ఒక్క కంప్యూటర్ గురించే కాదు .. మనిషి జీవితం లో ఉండే నవరసాలు ఈ బ్లాగ్ లో చూడవచ్చు  మనం. కంప్యూటర్ గురించి చెప్తూనే .. "నీ కళ్ళలో కన్నీరులా జారి..మనసులో భావంగా మారి... నీ ఊపిరిలో శ్వాసగా చేరి.. ప్రాణం ఉన్నంత వరకూ స్నేహితునిగా ఉంటా నేస్తమా..." అంటూ స్నేహం కోసం రాస్తారు . "నమశ్శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే" అంటూ ఆధ్యాత్మికలోకం లోకి తీస్కుని వెళ్తారు . SBI  బ్యాంకు వార్కి ఖాతాదారులు పడే ఇబ్బందిని వివరిస్తారు . మీరు కూడా ఒక సారి వెళ్లి చూడండి. 
http://namanasucheppindi.blogspot.in


మీకు ఉబుంటు  తెలుసా ? మా పాత ఆఫీసు లో వాడేవాళ్ళం .. ఉబుంటు కోసం తెలియని వాళ్ళు .. తెల్సినవాళ్ళు  కూడా  ఒకసారి ఈ బ్లాగ్ కి వెళ్లి కొత్త విషయాలు తెల్సుకోండి అంతే  కాకుండా  ఈ బ్లాగ్ లో  మనకి ఉపయోగపడే  విషయాలు ఎన్నో చెప్పారు  .. ప్రతి పోస్ట్ లోను విలువైన సమాచారం ఉంచారు . ఒకసారి  చూడండి మీకే తెలుస్తుంది .
http://spveerapaneni.blogspot.in/2012/03/abp.html

మీకు తెల్సిన కంప్యూటర్ బ్లాగ్ లను తెలియచేయండి.

3 comments:

  1. శ్రీధర్ గారు భేషజం లేకుండా తనకు తెలిసింది పదిమందికీ ఉపయోగకరం గా వీడియోలద్వారా చూపుతున్నారు . ఆయన మరిన్ని మంచి వీడియోలు అందించాలని కోరుతున్నాను. ప్లస్ లో కూడా కొన్ని ఆణిముత్యాలలాంటి మాటలను పోస్టులుగా ఉంచుతున్నారు.

    ReplyDelete
  2. నా బ్లాగు గురించి ఇక్కడ రాసినందుకు చాలా సంతోషంగా ఉంది.... కానీ నిజానికి నేను తెలుసుకున్న రెండు ముక్కలు అక్కడ రాస్తుంటాను అంతే... శ్రీధర్ గారు ద గ్రేట్ పర్సన్.. ఆయనే నాకు స్పూర్తి...ఆదర్శం అన్నీ..

    ReplyDelete
  3. మీరు శ్రీనివాసబాబు గారి బ్లాగును మరిచారు... ఆయన గొప్ప గొప్ప ఉపయోకరమైన సైట్లు, software మనకు పరిచయం చేస్తారు. ఇదిగోండి..లింకు
    http://rachanathecreation.blogspot.in/

    ReplyDelete