Thursday, May 24, 2012

కీర్తనలు

కీర్తనలు 

అవినేని భాస్కర్ గారు అన్నమయ్య సాహితి వైభవం అంటూ నడుపుతున్న బ్లాగ్ కి ఒకసారి మనం వెళ్తే .. మనకు అలనాటి అన్నమయ్య  రచనలు పరిచయం చేయడమే కాకుండా ..మనకు ఆడియో కూడా వినిపిస్తూ .. వాటికి తాత్పర్యాలు ,ప్రతిపదార్ధాలు  విడమర్చి వివరిస్తారు .. భాస్కర్ గారు అన్నట్లుగానే అన్నమయ్య  సంకిర్తనలకు వ్యాఖ్యానం రాయడం అంటే కత్తి మీద సాములాంటిదే . ఈ  లాంటి  బ్లాగ్  తెలుగు  లో  రచన  కొనసాగిస్తున్న భాస్కర్ గార్ని  మనం అభినందించకుండ ఏల ఉండగలం. 
http://tallapakaannamacharya.blogspot.in/

 అన్నమయ్య  కీర్తనలకు  సంబందిచిన మరో బ్లాగ్ ఇది ..అన్నమయ్య కీర్తనలు  అంటే  అమీతంగా  ఇష్టపడేవార్కి పండగే పండగ..  ఆడియో  తో పాటు తెలుగు లో పాటలు కూడా రాసారు .. మీరు చదువుతూ పాడుకోవచ్చు.. "అ" తో ప్రారంభం అయ్యే  పాటలను  ఒకోచోట  "ఇ"  తో ప్రారంభం అయ్యే పాటలను ఒకోచోట విభజించి మరీ మనకు  అన్నమయ్య   కీర్తనలను అందించారు . కీర్తనకు సంబందించిన చక్కటి చిత్రాలతో బ్లాగ్ ని అలంకరించారు .
http://annamacharya-lyrics.blogspot.in/

Sadhu.Sree Vaishnavi  తనగురించి పరిచయం చేస్కుంటూ "నేను 5th class నుండి 6th class కి వచ్చేసానండి. నన్ను అందరు ఈ బ్లాగ్ ఎలా రాస్తున్నావ్ అని అడుగుతూఉంటారు. నేను మా అమ్మ, మరియు అమ్మమ్మల స్పూర్తి తో బ్లాగుతున్నాను. ఈ సమ్మర్ లో ఎక్కువ పోస్ట్తలు పెడుతున్నాను. నా తప్పులున్నామన్నించి , ఆశీర్వధించండి. please." అని చెప్తుంది . ఆ బ్లాగ్ చూసిన వారు ఎవరైనా 6th class అంటే నమ్మరు . నిజానికి  మనకు బ్లాగ్ లాగ కనిపించదు . ఎవరో బాగా  తలపండినవారు రాస్తున్నార అనిపిస్తుంది . ఒకసారి బ్లాగ్ చుస్తే మీకే తెలుస్తుంది.
http://laharicom.blogspot.in/


మీకు తెల్సిన కీర్తనలకు సంబందిచిన బ్లాగ్ లను తెలియచేయండి 

1 comment:

  1. అన్నమయ్య కీర్తనలని సవివరంగా అందిస్తున్న బ్లాగు "అన్నమయ్య సాహితీ వైభవం" (http://tallapakaannamacharya.blogspot.in/)

    బ్లాగు రచయిత: అవినేని భాస్కర్ గారు

    ReplyDelete