ఒకనాడు బుద్ధ భగవానుడు తన శిష్యునికి దగ్గరగా ఉన్న చేరువునుంచిమంచినీరు తెమ్మని చెప్పారు, కాని అప్పుడే ఒక వరాహము (పంది) ఆ చెరువులో నుంచి వెళ్ళడం వల్ల నీరు అంతా మురికి అయ్యాయి, కనుక శిష్యుడు వట్టి చేతులతో తిరిగి వెనక్కు వచ్చాడు, రిక్త హస్తాలతో వచ్చిన శిష్యుణ్ణి చూసి, ఏమైందని అడిగారు బుద్ధ భగవానులు, జరిగినది అంతా శిష్యుడు చెప్పగా... కొంత సమయం తరువాత మళ్ళా వెళ్ళమన్నారు బుద్ధ భగవానుడు, శిష్యుడు వెళ్లి మళ్ళీ వట్టి చేతులతోనే తిరిగి వచ్చాడు, నీళ్ళు ఇంకా మురికిగా వున్నాయి అని, మళ్ళీ కాస్సేపటి తరువాత వెళ్ళ మన్నారు. ఈ సారి నీళ్ళు తేట పడినవి, శిష్యుడు నీళ్ళు తెచ్చాడు బుద్ధుడు అడిగాడు నీళ్ళు తేట పడటానికి ఏమి చేశావు ? అని ఏమిచేయ్యలేదు కొద్ది సమయం ఊరక వున్నాను అన్నాడు శిష్యుడు మనో మాలిన్యం కూడా అంతే ! ఉపేక్షించి స్పందించకుండా వుంటే ఆలోచనలు అవే ఉడిగి పోతాయి అదే నిర్వణమని బోధించాడు బుద్ధుడు ప్రతి సాధకుడు చేయవలిసింది ఇదే !!
కథ బాగుంది అనిపిస్తే మంచి వాళ్ళు, భక్తులు అన్నట్టు, అలాకాక చాలా ప్రేరనాత్మకం గా అనిపిస్తే సాధకులు అన్నట్టు, ఇంతకు ఈ కథ సత్సంగము అనే blog నుంచి గ్రహించటం జరిగింది, పేరుకు తగినట్లుగా ఈ blog లో సాధకులకు కావాల్సిన సర్వము లభిస్తాయి, కొన్ని సత్సంగ classes ను video ఇంకా audio రూపం లో భద్రపరచి ఉంచటం ఇందులో మనం గమనించవచ్చు, ఇంకా వీరి సత్సంగము ద్వారా ప్రచురితమైన జీవన్ ముక్తి ప్రకాశిక జ్ఞాన వాసిష్టము శ్రీ బ్రహ్మ విద్య, సర్వ వేదాంత శిరోభూషణము, వివేక చింతామణి, ఆరాధన మంత్ర పుష్పము , ఆత్మా నాత్మ వివేక దర్శిని, ఎరుక సంగ్రహము , నన్ను పొందుటకు ద్వాదశ మార్గాలు, శ్రీ గురు పూజా విధానము వంటి గ్రంథములు చదువరులకు వీలుగా pdf ఫైళ్ళను download చేసే అవకాశం కలిపించారు.
మరి ఆధ్యాత్మ జిజ్ఞాసువులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించ కోరుతున్నాము. - సాయిరాం
మరి ఆధ్యాత్మ జిజ్ఞాసువులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించ కోరుతున్నాము. - సాయిరాం
http://telugu-now.blogspot.in/
ReplyDelete