తెలుగు బ్లాగ్ గ్రూప్ కి నేను పోస్ట్ చేసిన పోస్ట్ ఇది
------------నాదో ఆలోచన
బ్లాగ్ రచయితలకు అందరికి నమస్కారం ,మన తెలుగు బ్లాగ్ లు చాలానే ఉన్నాయ్ .. ఒక్కో బ్లాగ్ చూస్తే ఆలా రాయడం సాధ్యమేనా అనిపిస్తుంది . మరో బ్లాగ్ చూస్తే బాగారాస్తున్నారు అనిపిస్తుంది . బ్లాగ్ లపై విశ్లేషణ (reviews) ఇచ్చే బ్లాగ్ లు ఎమన్నా ఉన్నాయా ? ఈ నెలలో మంచి పోస్ట్ లు ఆదరణ పొందిన పోస్ట్ లు అని ఏ సైట్ అన్న చెప్తున్నాయ ? ఈ నెలల లో టాప్ బ్లాగ్ లు అని ఎవరైనా ప్రకటిస్తున్నారా? నాకు తెలిసి ఏవరు చేయడం లేదనుకొంటున్నాను. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ ఒక గ్రూప్ లా ఏర్పడి మన తెలుగు బ్లాగ్ లను ప్రోత్సహిస్తే బాగుంటుంది కదా అని నా ఆలోచన . అలచేయడం వాళ్ళ ఈ గ్రూప్ వాళ్ళ మెప్పు కోసం బ్లాగర్లు అందరు తమ బ్లాగ్ లకు పదును పెడతారు ..బ్లాగ్ రచయితల నుంచి మంచి పోస్ట్ లు వస్తాయి . మమోలుగా ఐతే పోస్ట్ లు రాయడం వాళ్ళకి తెల్సినా వాళ్ళు కామెంట్ లు రాయడం జరుగుతుంది .కొన్ని పోస్ట్ లకు ఒక్క కామెంట్ కూడా రాదు (నేను చాల బ్లాగ్ లు చూసాను వాళ్ళు చాల గొప్పగా రాసిన వాటికి కూడా ఒక్క కామెంట్ కూడా లేదు ), బ్లాగ్ రాసిన వారు ఆశించేది బాగుంది అనే చిన్న మాట కోసమే గా.. పెద్దలు అందరు ఒక గ్రూప్ లా ఏర్పడితే ఆ గ్రూప్ నుండి వచ్చే ప్రశంస లేదా విమర్శ బ్లాగ్ రచయితలను మరింత ఉత్సాహపరుస్తుంది . ఇప్పుడు అందరు ఒక్కో బ్లాగ్ పెట్టుకోవడం ..మీ బ్లాగ్ ని పోస్ట్ చేయండి అనడం .. అందరు పోస్ట్ చేస్తే వారు ఆడ్ లు ఇచ్చుకోవడం తప్ప జరుగుతుంది ఏం లేదు .. నేను ఎమన్నా తప్పులు రాసి ఉంటె క్షమించగలరు . నా భావాన్ని అర్ధం చేస్కుంటారు అని అనుకుంటున్నాను .
--
ఈ పోస్ట్ తరువాత గూగుల్ ప్లస్ లో పెద్దచర్చ జరిగింది. దాని ఫలితంగానే ఈ బ్లాగ్ ఏర్పడింది . మంచి బ్లాగులను అందర్కి అందించాడమే ఈ బ్లాగ్ ఉద్దేశ్యం . మీ బ్లాగ్ ని ఈ బ్లాగ్ లోకి చేర్చాలంటే మీ బ్లాగ్ ని తగిన కేటగిరి లో సెలెక్ట్ చేస్కుని అక్కడ ఉన్న పోస్ట్ లలో మీబ్లాగ్ గురించి పరిచయం చేస్తూ కామెంట్ రాయండి లేదా వేరే బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఆ బ్లాగ్ గురించి కామెంట్ రాయండి . మీ బ్లాగ్ ని చూసి మేము రివ్యూ చేసి ఈ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాము . అలపోస్ట్ అయిన బ్లాగ్ లకి రివ్యూ రాయడం జరుగుతుంది భవిష్యత్ లో ప్రతి నెల ఉత్తమపోస్ట్ లను కూడా ప్రకటించడం జరుగుతుంది . ఏ విధమైన కేటగిరీలు ఉంటే బాగుంటుందో మీరే తెలిచేయండి . దేనిపై మీ స్పందన తెలియచేయండి
-------------------------------------------------------------------------------------------
పెద్దలకు నమస్కారం,
నాదో ఆలోచన అంటూ మీకు తెలియచేస్తే .. మీ అభిప్రాయాల్ని తెలియచేసినందుకు చాల సంతోషం . ముందుగా మనం మనకి నచ్చిన (అందర్కిఉపయోగపడే బ్లాగులను ) బ్లాగ్ లను పోస్ట్ చేద్దాం . ఆ తరువాత వాటి పై విశ్లేషణ కొనసాగిద్దాం . http://telugublogreviews.blogspot.in/ లో మీరు కేటగిరి లో మీకు నచ్చిన బ్లాగ్ ని కాని ,లేదా మీ బ్లాగ్ నే పరిచయం చేస్తూ కామెంట్ రూపం లో పోస్ట్ చేయండి . మీ బ్లాగ్ ( మీకు నచ్చిన ) బ్లాగ్ అందర్కి ఉపయోగ పడే బ్లాగ్ అనుకుంటే ఆ కామెంట్ ని బ్లాగ్ లో పోస్ట్ చేద్దాం . నేను చెప్పిన భావం మీకు అర్ధం అయింది అనుకుంటా!
ఉదా :
నా బ్లాగ్ లో నేను చూసిన ప్రదేశాల విషయాలను పోస్ట్ చేస్తున్నాను .. నా బ్లాగ్ లో మీరు కంచి , రామేశ్వరం , అరుణాచలం , మహాబలిపురం వంటి ప్రదేశాలకు ఏల వెళ్ళాలి , అక్కడ చూడవాల్సినవి మొదలైన విషయాలను పొందుపరిచాను .
http://rajachandraphotos.blogspot.in/
-------------------------------------------------------------------------------------------
పెద్దలకు నమస్కారం,
నాదో ఆలోచన అంటూ మీకు తెలియచేస్తే .. మీ అభిప్రాయాల్ని తెలియచేసినందుకు చాల సంతోషం . ముందుగా మనం మనకి నచ్చిన (అందర్కిఉపయోగపడే బ్లాగులను ) బ్లాగ్ లను పోస్ట్ చేద్దాం . ఆ తరువాత వాటి పై విశ్లేషణ కొనసాగిద్దాం . http://telugublogreviews.blogspot.in/ లో మీరు కేటగిరి లో మీకు నచ్చిన బ్లాగ్ ని కాని ,లేదా మీ బ్లాగ్ నే పరిచయం చేస్తూ కామెంట్ రూపం లో పోస్ట్ చేయండి . మీ బ్లాగ్ ( మీకు నచ్చిన ) బ్లాగ్ అందర్కి ఉపయోగ పడే బ్లాగ్ అనుకుంటే ఆ కామెంట్ ని బ్లాగ్ లో పోస్ట్ చేద్దాం . నేను చెప్పిన భావం మీకు అర్ధం అయింది అనుకుంటా!
ఉదా :
నా బ్లాగ్ లో నేను చూసిన ప్రదేశాల విషయాలను పోస్ట్ చేస్తున్నాను .. నా బ్లాగ్ లో మీరు కంచి , రామేశ్వరం , అరుణాచలం , మహాబలిపురం వంటి ప్రదేశాలకు ఏల వెళ్ళాలి , అక్కడ చూడవాల్సినవి మొదలైన విషయాలను పొందుపరిచాను .
http://rajachandraphotos.blogspot.in/
(మా ఉద్దేశ్యం లో మంచి బ్లాగ్ లను అన్ని ఒకదగ్గరకు చేర్చాలనే ప్రయత్నం , అలాంటి బ్లాగ్ రచనలను చేసేవారని ప్రోత్సహించడం ద్వారా వారినుండి ఇంకా మంచి మంచి పోస్ట్ లను రాబట్టలానే ఈ చిరు ప్రయత్నం)
మన తెలుగులో సామెతలకి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. నానుడి, సామెత, అనేవి ప్రతివాడు ఎప్పుడో ఒక్కసారైనా వాడుతూనే ఉంటాడు. అలాటి సామెతలు ప్రదేశాన్ని బట్టి, వాడుక భషను బట్టి, అక్కడి పరిస్తితులనుబట్టి ఏర్పడినవి. వీటిలో ఎంతో అనుభవం మీద చెప్పిన చక్కని సత్యాలు చిన్ని మాటలలో అందరికి అర్థం అయ్యెట్టుగా ఉంటాయి. అటువంటి సామెతలను మన తెలుగు వారికి అందుబాటులోకి తేవటాని ఒకచోట చేర్చాను. ప్రస్తుతానికి 9325 వరకూ ఒకచోట ఉన్నాయి. మరికొన్ని మిత్రులు నాతో పంచుకొన్నవి చేర్చే పని మిగిలి ఉంది. ఈ సామెతలు అందరికి ఉపయోగకరంగా అందుబాటులోనికి వచ్చేటట్లుగా మీ లిష్టులో చేర్చవలసింది.
ReplyDeleteమీరు ఇచ్చిన కేటగరీలో ఈ బ్లాగు రాదు కనుక కామెంటు గా పోష్టు చేస్తున్నాను
ధన్యవాదములు
నా బ్లాగు అడ్రస్సు
http://dsubrahmanyam.blogspot.in/
D.Subrahmanyam
మన తెలుగులో ఉన్న సాహిత్యాన్ని, కావ్యాలను సులభమైన తెలుగులో అందరికి పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన బ్లాగు ' సాహిత్యసౌరభం '. ఇప్పటిదాకా కొన్ని కావ్యాలను, పరిచయం చేసాను.
ReplyDeleteబ్లాగు అడ్రస్సు
http://sahityasourabham.blogspot.in/
ధన్యవాదములు
సుబ్రహ్మణ్యం
ప్రతిరోజు ఎన్నో విషయాలను చూస్తున్నాం. చదువుతున్నాం. వాటిలోకొన్ని మనకి ఎంతో ఆలోచనలను రేకెతిస్తాయి. ఆలాంటి ఆలోచనల సంకలనమే ఈ బ్లాగు. ' బందరు - నీ పాత పేరేమిటి? ', ' ఏడుకొందలవాడా ఎవరయ్యా నువ్వు? ' లాంటి పోష్టులే కాక సంగీతపరమైనవి, ఆధ్యాత్మ పరమైనవీ సాహిత్యపరమైనవీ కూడా ఈ బ్లాగులో ఉన్నాయి.
ReplyDeleteబ్లాగు అడ్రస్సు:
http://alochanantarangalu.blogspot.in/
ధన్యవాదములు
సుబ్రహ్మణ్యం
నేనూ ఓ బ్లాగు ఓనర్ నని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అయితే మీరు చెప్పినట్టు ఏదో ఒకే అంశం మీద నేను వ్రాయటం లేదు. నా బ్లాగుకి హాస్యవల్లరి అని నామకరణం ఒక శ్రేయోభిలాషి చేసారు. అయితే అందులో కేవలం హాస్యమే కాకుండా ఆధ్యాత్మికం, మా ఆవిడ చేతివంటలు, నేను చూసిన ప్రదేశాలు, నేను నివసించిన ఊరు ఇలా రకరకాల విషయాలపై వ్రాయడం జరిగింది. కొంతమంది మెచ్చుకున్నారు.. లబ్ధ ప్రతిష్టులు ఒకరు మీరు పోస్ట్ చేసిన ఒక పోస్ట్ లో హాస్యం ఎక్కడ ఉంది పో పొమ్మన్నారు.. అయ్యా నాకుతెలిసింది వ్రాయటానికి ఉన్న ఒకేఒక బ్లాగు ఇది. మీరు హాస్యం లేదన్నదాంట్లో హాస్యం ఉందని కూడా చాలామంది అన్నారు మన్నించి ఆదరించండి అని చెప్పాననుకోండి.. ఇంతకీ ఈ సోత్కర్ష ఎందుకంటే ఇప్పుడు మీరు విభజించిన క్యాటగిరీలలో నన్ను ఎక్కడ ఇమడ మంటారు.. తెలియజేయగలరు.. నా బ్లాగు dvhrao.blogspot.com శ్రమకు మన్నించండి.
ReplyDeleteహనుమంత రావు గారు నమస్తే అండి,
ReplyDeleteమీ బ్లాగ్ లో పోస్ట్ ని బట్టి , ఏ కేటగిరీ కి చెందుతుందో ఆ కేటగిరి లో పరిచయం చేయండి . వంటల పోస్ట్ ఐతే వంటకాలలో .. ఆధ్యాత్మికం సంబందించిన పోస్ట్ ఐతే ఆధ్యాత్మికం లో పోస్ట్ చేయండి .
వ్యక్తిగత బ్లాగుల విషయాలకొచ్చేసరికి వర్గీకరణ కొంచెం కష్టతరమైన విషయమే. ఎందుకంటే ఏదో ఒక విషయమే ప్రధానంగా చెప్పాలనుకునే వారు తక్కువే. ఎక్కువగా సరదాకి తమ తమ భావాలు పంచుకోటానికే ఎక్కువమంది వ్రాస్తున్నట్ల్లుగా తోస్తోంది. కనుక వర్గీకరణలొ తక్కువ కేటగిరీలు వుంటే బాగుంటుందని అభిప్రాయం. హనుమంతరావుగారి అభిప్రాయంకూడా ఇదే ననుకుంటా బహుశః.
ReplyDelete1. అధ్యాత్మికం
2. స్వీయ సాహిత్య బ్లాగులు (కధలు, కవితలు, పద్యాలు)
3. యాత్రా విశేషాలు
4. వంటల బ్లాగులు
5. వార్తా బ్లాగులు (ఈ మధ్య ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి)
6. పుస్తక విమర్శలు - వ్యాసాలు
7. చారిత్రకాంశాలు
8. కంప్యూటర్ / బ్లాగు పాఠాలు
9. స్పోకెన్ ఇంగ్లీషు
ఇలా (మరికొందరు మేధావులు మరిన్ని సలహాలిస్తే) వర్గీకరిస్తే ఎలావుంటుంది? ఇది ఒక అభిప్రాయం మాత్రమే సుమండీ.
శశిధర్ పింగళి గారికి నా బాధ అర్థమయ్యింది. నిజమే.. నేను ఆ యా సందర్భాలలో వచ్చిన ఆలోచనలతో ఏదో ఒకటి వ్రాస్తూ ఉంటాను. హాస్యమా ఆధ్యాత్మికమా అని ముందు అనుకోను. అయితే పోస్ట్ ను బట్టి వర్గీకరణ చెయ్యమని శ్రీ రాజాచంద్ర గారంటున్నారు. ఫోస్ట్ వ్రాసాక అది ఏ కేటగిరి అయితే దాని ప్రకారం ఆ పోస్ట్ ను మాత్రం ఈ బ్లాగులో కూడా నమోదు చెయ్యాలి అని అర్థం అయింది. అటువంటప్పుడు మీరు ప్రతిపాదిస్తున్న ఈ అసోసియేషనులో పోస్టును బట్టే తప్ప బ్లాగును బట్టి నేను ఫలానా వర్గం వాణ్ణి, సారీ ఫలానా కేటగిరీ(ఒక్కోప్పుడు ఇంగ్లీషులో సదుపాయం !) వాణ్ణని పరిచయం చేసుకోలేము.కదా ? నా అమాయకత్వం గుర్తించి కొంచెం విశదీకరించండి.
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteనమస్కారం అండి , మీరు చెప్పింది నిజమే .
Deleteనిజమే చాలామంది బ్లాగర్లు ఒకటి కంటే ఎక్కువ కేటగిరిలకు సంబందించిన విషయాలను తమ బ్లాగ్ లలో రాస్తున్నారు .. వారికోసమే "నా బ్లాగ్" కేటగిరి మీరు ఒకటి కంటే ఎక్కువ కేటగిరిలను సంబందించిన విషయాలను ఒకే బ్లాగ్ లో రాస్తూ ఉంటే .. మీ బ్లాగ్ కోసం "నా బ్లాగ్" కేటగిరి లో పరిచయం చేయండి .
రాజా చంద్ర గారు ..ఇప్పుడు నా బ్లాగును మీ కేటగరైశేషన్ లో గుర్తించేట్టు చేసారు. పరిచయమైనట్టే భావిస్తున్నాను.చక్కగా ఎడిట్ చేసివ్రాసారు. ధన్యవాదాలు. ప్రస్తుతం నేను హైదరాబాదులో ఉన్నాను. మా ఊరు రాజమండ్రీ వెళ్ళక కొత్త పోస్టులు వ్రాస్తాను. అని ఇందు మూలముగా ప్రియ బ్లాగరులకు తెలియజేసుకొంటున్నాను.
ReplyDeleteRaja..Matalu ravadam ledhu nuvvu chesthunna prayathnam mechukovadaniki. Andhuku manaspoorthiga oka chirunavvutho kudina dhanyvadhamey cheyagalanu..
ReplyDelete:):)
Dhanyavaadhalu.
Thank You Udaya
DeleteThank you for your best Idea
ReplyDeleteGood work sir
ReplyDeletebhagyamati.blogspot.com
ReplyDelete