Thursday, May 31, 2012

నా బ్లాగ్

నా బ్లాగ్

నిజమే చాలామంది బ్లాగర్లు ఒకటి కంటే ఎక్కువ కేటగిరిలకు సంబందించిన విషయాలను  తమ బ్లాగ్ లలో రాస్తున్నారు .. వారికోసమే ఈ కేటగిరి మీరు ఒకటి కంటే ఎక్కువ కేటగిరిలను సంబందించిన విషయాలను  ఒకే బ్లాగ్ లో రాస్తూ ఉంటే .. మీ బ్లాగ్ కోసం ఇక్కడ పరిచయం చేయండి .

నా బ్లాగుకి హాస్యవల్లరి అని నామకరణం ఒక శ్రేయోభిలాషి చేసారు. అయితే అందులో కేవలం హాస్యమే కాకుండా ఆధ్యాత్మికం, మా ఆవిడ చేతివంటలు, నేను చూసిన ప్రదేశాలు, నేను నివసించిన ఊరు ఇలా రకరకాల విషయాలపై వ్రాయడం జరిగింది.
బ్లాగు అడ్రస్సు:
http://dvhrao.blogspot.in/
ధన్యవాదములు .
హనుమంత రావు

ప్రతిరోజు ఎన్నో విషయాలను చూస్తున్నాం. చదువుతున్నాం. వాటిలోకొన్ని మనకి ఎంతో ఆలోచనలను రేకెతిస్తాయి. ఆలాంటి ఆలోచనల సంకలనమే ఈ బ్లాగు. ' బందరు - నీ పాత పేరేమిటి? ', ' ఏడుకొందలవాడా ఎవరయ్యా నువ్వు? ' లాంటి పోష్టులే కాక సంగీతపరమైనవి, ఆధ్యాత్మ పరమైనవీ సాహిత్యపరమైనవీ కూడా ఈ బ్లాగులో ఉన్నాయి.

బ్లాగు అడ్రస్సు:
http://alochanantarangalu.blogspot.in/
ధన్యవాదములు .
సుబ్రహ్మణ్యం


కుసింత వ్యంగ్యం, కుసింత కామెడీ,కాసిన్ని జ్ఞాపకాలు, అప్పుడప్పుడు పేరడీలు,తవికలు,ఇంకా బోలెడన్ని ఆడియోలు (కీర్తనలు, కాస్త అరుదైన కలెక్షన్లు) కలిపిన బ్లాగ్ ఇది :)
బ్లాగు అడ్రస్సు:
http://blogavadgeetha.blogspot.in/
ధన్యవాదములు .
శంకర్ .


హాయ్ !ఒకసారి ఇటువైపు వచ్చి వెళ్ళండి.
నేనేనండీ..వనజ వనమాలి.
నా బ్లాగ్ లో వాస్తవం 90 % అయితే 10 % నా పైత్యం జత కూర్చి కథ అయినా కవిత అయినా, వ్యాసం అయినా,.. మనసు చెప్పినట్టే మరో ముసుగు లేకుండా చెప్పేస్తాను.
ఇక పాటలు గురించి చెప్పనిదే..నాకు నిద్ర పట్టదు.అప్పుడప్పుడు సరదాగా కొన్ని కబుర్లుతో.. బ్లాగింగ్ అనే వ్యసనాన్ని సీరియస్ గా కొనసాగిస్తున్నాను.
నా బ్లాగ్ చూడండి..నచ్చితే మళ్ళీ మళ్ళీ చూడండి.
బ్లాగు అడ్రస్సు: 
http://vanajavanamali.blogspot.in
ధన్యవాదములు .
వనజవనమాలి

సుస్వాగతం.నా బ్లాగ్ గూర్చి చెప్పాలి అంటే ఏమి లేదు . ఇది నా ప్రపంచం...నేను చూసినవి,నాకు నచ్చినవి,
మీకు ఉపయోగపడుతాయి అనుకున్నవి...సహృదయులైన మీరే వచ్చి చోసి చెప్పండి...నా భావాలు,సంతోషాలు పంచుకోండి .
http://itissasiworld.blogspot.in
శశి కళ

Monday, May 28, 2012

బ్లాగు పాఠములు

బ్లాగు పాఠములు
కొత్తగా బ్లాగ్ ప్రారంభించే  వాళ్ళకి ఉపయోగ పడే విధంగా .. పాత వాళ్ళకి కొత్తవిషములు  చెప్పే విధంగా రచనలు  చేస్తున్నా  బ్లాగ్ లను పరిచయం చేయండి 

యాత్ర విశేషాలు

యాత్ర విశేషాలు 

యాత్రావిశేషాలు తెలియచేసే బ్లాగ్ లలో మొదటిగా చెప్పుకోవాల్సింది ..  PSM లక్ష్మి గారి బ్లాగ్ ... ఈ బ్లాగ్ చూస్తే మీరు మన ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక , తమిళనాడు తో పాటు కాశీ గురించి పూర్తిసమచారం దొరుకుతుంది . లక్ష్మి గారి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే  లక్ష్మి గారు   నల్గొండ జిల్లాలోని పుణ్యక్షేత్రాలు గురించి రాసిన  యాత్రా దర్శని పుస్తకం  కినిగె వారు రిలీజ్ చేశారు.

http://4psmlakshmi.blogspot.in/

ఉత్తర భారతదేశ యాత్ర విశేషాలు తెల్సుకోవాలంటే  .. సుజాత గారి బ్లాగ్ మనం చూడాలి .. పంచద్వారకాయాత్ర ,మాతృ గయ, అబూ పర్వతం, రుక్మిణీదేవి మందిరం విశేషాలను సుజాతగారు చాల చక్కగా వివరిస్తున్నారు.   మనలో చాల మంది చూడని ఈ ప్రదేశాలు మనకందర్కి తెలియచేస్తున్నా సుజాత గార్ని అభినందిచావాల్సిందే .

http://sujathathummapudi.blogspot.in/


 నా బ్లాగ్ కోసం నేనే రాస్కోవడం అంతగా బాగోదేమో .. బహుశా అందుకే అనుకుంటాను వనజవనమాలి గారు కామెంట్ పోస్ట్ చేసారు ..
"మన భారత దేశం లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రములని పరిచయం చేస్తూ..ఆసక్తికర మైన విశేషాలతో.. మనని మనం ఉన్నచోటు నుండే దర్శింపజేసే బ్లాగ్ ఒకటి నేను చూడటం జరిగింది. ఆ బ్లాగ్ చాలా బాగుంది. తెలుగు బ్లాగులలో ఆ బ్లాగ్ పరిచయం చేయండి. నా బ్లాగ్ లింక్ ఇక్కడ ఉంది."

http://rajachandraphotos.blogspot.in/



కొత్త ప్రదేశాలను పరిచయం చేస్తూ.. అక్కడ విశేషాలను వివరించే బ్లాగ్ లను పరిచయం చేయండి 



సామెతలు

సామెతలు
మన తెలుగులో సామెతలకి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. నానుడి, సామెత, అనేవి ప్రతివాడు ఎప్పుడో ఒక్కసారైనా వాడుతూనే ఉంటాడు. అలాటి సామెతలు ప్రదేశాన్ని బట్టి, వాడుక భషను బట్టి, అక్కడి పరిస్తితులనుబట్టి ఏర్పడినవి. వీటిలో ఎంతో అనుభవం మీద చెప్పిన చక్కని సత్యాలు చిన్ని మాటలలో అందరికి అర్థం అయ్యెట్టుగా ఉంటాయి. అటువంటి సామెతలను మన తెలుగు వారికి అందుబాటులోకి తేవటాని ఒకచోట చేర్చాను. ప్రస్తుతానికి 9325 వరకూ ఒకచోట ఉన్నాయి. మరికొన్ని మిత్రులు నాతో పంచుకొన్నవి చేర్చే పని మిగిలి ఉంది. ఈ సామెతలు అందరికి ఉపయోగకరంగా అందుబాటులోనికి వచ్చేటట్లుగా మీ లిష్టులో చేర్చవలసింది.
నా బ్లాగు అడ్రస్సు
http://dsubrahmanyam.blogspot.in/
ధన్యవాదములు
సుబ్రహ్మణ్యం


సామెతలతో రచనలు చేస్తున్న బ్లాగ్ లను పరిచయం చేయండి 

ప్రముఖుల పరిచయం

ప్రముఖుల పరిచయం
ప్రముఖ వ్యక్తులను పరిచయం చేస్తూ .. గొప్ప  వాళ్ళ జీవిత చరిత్రలను  రచనలు చేస్తున్న బ్లాగ్ లను పరిచయం చేయండి 

కథలు

కథలు 


 చక్కటి రచనతో  ఆసక్తిగా సాగే కధనంతో .. రచనలు చేస్తున్నా  బ్లాగ్ లను పరిచయం చేయండి .

పద్యాలు

పద్యాలు
మీకు పరిచయం ఉన్న పద్యాలు లకు సంబంధించిన బ్లాగ్ లను పరిచయం చేయండి .

స్పోకెన్ ఇంగ్లీష్

స్పోకెన్ ఇంగ్లీష్ 
తెలుగు మనకు 'అమ్మ'- ఇంగ్లిష్ మనకు 'నేస్తం' జీవితం లో ఎదగడానికి ఇద్దరూ అవసరమే..మనమందరమూ ఇంగ్లీష్  నేర్చుకునే ప్రయత్నం చేద్దాం  అంటారు ప్రతాప్ గారు ,  భాష కోసం చెప్తూ  భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది.ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు.కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు చెందుతూ ఉంటుంది అని చెప్తారు ..  ఒక్క ఇంగ్లీష్ ఒకటే కాదు నేటి యువతరం కోసం ముఖ్యంగా  నిరుద్యోగ మిత్రులకు కోసం "JOB SEARCH" ఓ క్రొత్త పేజీ ప్రారంభించారు . Social Responsibilities కోసం శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు చెప్పిన ప్రవచాన్ని వినమని అనకుండా .. "ఇక్కడ క్లిక్ చేసి శ్రీ కోటేశ్వరరావు గారి మధుర వచనం వినండి.ప్లీజ్.. ..1 గంట.21 నిమిషాలు దేవునికి నివేదనగా భావించి శ్రద్దగా వినమని ప్రార్ధిస్తున్నాను... -- మీ ప్రతాప్" అంటారాయన . ఒక్కసారి ప్రతాప్ గారి బ్లాగ్ చూసి ఆయన చేస్తున్న కృషిని అభినందిచి రండి .
http://tellenglish.blogspot.in/


మీకు తెల్సిన స్పోకెన్ ఇంగ్లీష్ బ్లాగ్ లను పరిచయం చేయండి . 

ఇతిహాసములు

ఇతిహాసములు



మీ బ్లాగ్ లేదా మీకు తెల్సిన బ్లాగ్ లలో ఇతిహాసములు లకు సంబంధినిన విశేషాలు ఉంటే మాకు పరిచయం చేయండి

సోమవారము సాధకుడు సత్సంగము


ఒకనాడు బుద్ధ భగవానుడు  తన  శిష్యునికి  దగ్గరగా  ఉన్న  చేరువునుంచిమంచినీరు  తెమ్మని  చెప్పారు,  కాని  అప్పుడే  ఒక  వరాహము (పంది)  ఆ  చెరువులో నుంచి  వెళ్ళడం  వల్ల నీరు అంతా  మురికి  అయ్యాయి, కనుక  శిష్యుడు  వట్టి  చేతులతో  తిరిగి వెనక్కు వచ్చాడు, రిక్త హస్తాలతో వచ్చిన శిష్యుణ్ణి చూసి, ఏమైందని  అడిగారు  బుద్ధ భగవానులు, జరిగినది  అంతా   శిష్యుడు చెప్పగా...  కొంత  సమయం  తరువాత  మళ్ళా  వెళ్ళమన్నారు  బుద్ధ భగవానుడు, శిష్యుడు  వెళ్లి  మళ్ళీ  వట్టి  చేతులతోనే  తిరిగి  వచ్చాడు, నీళ్ళు  ఇంకా మురికిగా  వున్నాయి  అని, మళ్ళీ  కాస్సేపటి  తరువాత  వెళ్ళ  మన్నారు. ఈ   సారి  నీళ్ళు  తేట  పడినవి, శిష్యుడు  నీళ్ళు  తెచ్చాడు బుద్ధుడు  అడిగాడు  నీళ్ళు   తేట  పడటానికి  ఏమి  చేశావు ? అని  ఏమిచేయ్యలేదు కొద్ది  సమయం  ఊరక  వున్నాను  అన్నాడు  శిష్యుడు మనో  మాలిన్యం  కూడా  అంతే !  ఉపేక్షించి  స్పందించకుండా  వుంటే  ఆలోచనలు  అవే  ఉడిగి  పోతాయి  అదే  నిర్వణమని  బోధించాడు  బుద్ధుడు  ప్రతి  సాధకుడు  చేయవలిసింది  ఇదే !!

కథ బాగుంది అనిపిస్తే మంచి వాళ్ళు, భక్తులు అన్నట్టు, అలాకాక చాలా ప్రేరనాత్మకం గా అనిపిస్తే సాధకులు అన్నట్టు, ఇంతకు ఈ కథ  సత్సంగము  అనే blog నుంచి గ్రహించటం జరిగింది, పేరుకు తగినట్లుగా ఈ blog లో సాధకులకు కావాల్సిన సర్వము లభిస్తాయి, కొన్ని సత్సంగ classes ను video ఇంకా audio రూపం లో భద్రపరచి ఉంచటం ఇందులో మనం గమనించవచ్చు, ఇంకా వీరి సత్సంగము ద్వారా ప్రచురితమైన జీవన్ ముక్తి  ప్రకాశిక  జ్ఞాన వాసిష్టము శ్రీ బ్రహ్మ విద్య,  సర్వ వేదాంత శిరోభూషణము,  వివేక చింతామణి,  ఆరాధన మంత్ర పుష్పము , ఆత్మా నాత్మ వివేక దర్శిని,  ఎరుక సంగ్రహము , నన్ను పొందుటకు ద్వాదశ మార్గాలు,  శ్రీ గురు పూజా విధానము వంటి గ్రంథములు చదువరులకు వీలుగా pdf ఫైళ్ళను download చేసే అవకాశం కలిపించారు.


మరి ఆధ్యాత్మ జిజ్ఞాసువులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించ కోరుతున్నాము. - సాయిరాం 

Saturday, May 26, 2012

కవిత్వం

కవిత్వం
చక్కటి కవిత్వంతో ఆకట్టుకొనే బ్లాగ్ లను పరిచయం/తెలియ  చేయండి . 

Thursday, May 24, 2012

కీర్తనలు

కీర్తనలు 

అవినేని భాస్కర్ గారు అన్నమయ్య సాహితి వైభవం అంటూ నడుపుతున్న బ్లాగ్ కి ఒకసారి మనం వెళ్తే .. మనకు అలనాటి అన్నమయ్య  రచనలు పరిచయం చేయడమే కాకుండా ..మనకు ఆడియో కూడా వినిపిస్తూ .. వాటికి తాత్పర్యాలు ,ప్రతిపదార్ధాలు  విడమర్చి వివరిస్తారు .. భాస్కర్ గారు అన్నట్లుగానే అన్నమయ్య  సంకిర్తనలకు వ్యాఖ్యానం రాయడం అంటే కత్తి మీద సాములాంటిదే . ఈ  లాంటి  బ్లాగ్  తెలుగు  లో  రచన  కొనసాగిస్తున్న భాస్కర్ గార్ని  మనం అభినందించకుండ ఏల ఉండగలం. 
http://tallapakaannamacharya.blogspot.in/

 అన్నమయ్య  కీర్తనలకు  సంబందిచిన మరో బ్లాగ్ ఇది ..అన్నమయ్య కీర్తనలు  అంటే  అమీతంగా  ఇష్టపడేవార్కి పండగే పండగ..  ఆడియో  తో పాటు తెలుగు లో పాటలు కూడా రాసారు .. మీరు చదువుతూ పాడుకోవచ్చు.. "అ" తో ప్రారంభం అయ్యే  పాటలను  ఒకోచోట  "ఇ"  తో ప్రారంభం అయ్యే పాటలను ఒకోచోట విభజించి మరీ మనకు  అన్నమయ్య   కీర్తనలను అందించారు . కీర్తనకు సంబందించిన చక్కటి చిత్రాలతో బ్లాగ్ ని అలంకరించారు .
http://annamacharya-lyrics.blogspot.in/

Sadhu.Sree Vaishnavi  తనగురించి పరిచయం చేస్కుంటూ "నేను 5th class నుండి 6th class కి వచ్చేసానండి. నన్ను అందరు ఈ బ్లాగ్ ఎలా రాస్తున్నావ్ అని అడుగుతూఉంటారు. నేను మా అమ్మ, మరియు అమ్మమ్మల స్పూర్తి తో బ్లాగుతున్నాను. ఈ సమ్మర్ లో ఎక్కువ పోస్ట్తలు పెడుతున్నాను. నా తప్పులున్నామన్నించి , ఆశీర్వధించండి. please." అని చెప్తుంది . ఆ బ్లాగ్ చూసిన వారు ఎవరైనా 6th class అంటే నమ్మరు . నిజానికి  మనకు బ్లాగ్ లాగ కనిపించదు . ఎవరో బాగా  తలపండినవారు రాస్తున్నార అనిపిస్తుంది . ఒకసారి బ్లాగ్ చుస్తే మీకే తెలుస్తుంది.
http://laharicom.blogspot.in/


మీకు తెల్సిన కీర్తనలకు సంబందిచిన బ్లాగ్ లను తెలియచేయండి 

Wednesday, May 23, 2012

కంప్యూటర్ బ్లాగ్ లు

 కంప్యూటర్ బ్లాగ్ లు
2007 లో కంప్యూటర్ ఎరా 

తెలుగులో కంప్యూటర్ గురించి చెప్పాలంటే శ్రీధర్ గారు ఒక్కరే ఉన్నారు అనడం లో అతిశయోక్తి కాదేమో .   కంప్యూటర్ అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా శ్రీధర్ గారు చెప్పే  విషయాలను  ఫాలో  అయితే  కంప్యూటర్  తో  ఆట ఆడుకోవడం పెద్ద కస్తమేమి కాదు .  ఇంటర్ నెట్ లో  మనకి ఎదురైయే ఎన్నో సమస్యలకి శ్రీధర్ గారు  ఎప్పడికప్పుడు  వీడియో లను  అప్లోడ్ చేస్తూ మరీ వివరిస్తుంటారు .  మీరు ఇంకా  శ్రీధర్ గారి వెబ్సైటు చూడకపోతే కంప్యూటర్ గురించి ఇంటర్నెట్ తెల్సుకోవాల్సిన విషయాలను మీరు మిస్ అవుతున్నాట్టే . 
http://computerera.co.in/blog/


కంప్యూటర్ బ్లాగ్ లలో మరో బ్లాగ్ సాయి గారిది . నాకు  శ్రీధర్ గారు  అంటే  అభిమానం అని చెప్తారాయన .  తన బ్లాగ్ గురించి పరిచయం చేస్కుంటూ నా మనసు....... నా మదిలో మెదిలే ఆలోచనలకు అక్షరరూపం..  సాయి గారు ఒక్క కంప్యూటర్ గురించే కాదు .. మనిషి జీవితం లో ఉండే నవరసాలు ఈ బ్లాగ్ లో చూడవచ్చు  మనం. కంప్యూటర్ గురించి చెప్తూనే .. "నీ కళ్ళలో కన్నీరులా జారి..మనసులో భావంగా మారి... నీ ఊపిరిలో శ్వాసగా చేరి.. ప్రాణం ఉన్నంత వరకూ స్నేహితునిగా ఉంటా నేస్తమా..." అంటూ స్నేహం కోసం రాస్తారు . "నమశ్శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే" అంటూ ఆధ్యాత్మికలోకం లోకి తీస్కుని వెళ్తారు . SBI  బ్యాంకు వార్కి ఖాతాదారులు పడే ఇబ్బందిని వివరిస్తారు . మీరు కూడా ఒక సారి వెళ్లి చూడండి. 
http://namanasucheppindi.blogspot.in


మీకు ఉబుంటు  తెలుసా ? మా పాత ఆఫీసు లో వాడేవాళ్ళం .. ఉబుంటు కోసం తెలియని వాళ్ళు .. తెల్సినవాళ్ళు  కూడా  ఒకసారి ఈ బ్లాగ్ కి వెళ్లి కొత్త విషయాలు తెల్సుకోండి అంతే  కాకుండా  ఈ బ్లాగ్ లో  మనకి ఉపయోగపడే  విషయాలు ఎన్నో చెప్పారు  .. ప్రతి పోస్ట్ లోను విలువైన సమాచారం ఉంచారు . ఒకసారి  చూడండి మీకే తెలుస్తుంది .
http://spveerapaneni.blogspot.in/2012/03/abp.html

మీకు తెల్సిన కంప్యూటర్ బ్లాగ్ లను తెలియచేయండి.

వంట బ్లాగ్ లు

 వంట బ్లాగ్ లు

ఈ జీవితం షడ్రుచులమయం మంటూ బ్లాగ్ ఓపెన్ చేయచేగానే మనకు జ్యోతి గారు స్వాగతం పలుకుతారు . మన ఆరోగ్యం విషయం లో చాల జాగ్రత్త తీస్కుని మరీ ఆరోగ్యకరమైన వంటకాలను  వివరిస్తారు  . అంతేకాకుండా ఎక్కువ  సమయం వంటింట్లో గడపలేని వాళ్ళకోసం తక్కువ సమయం లో అయ్యే వంటకాలను రుచి విషయం లో రాజీపడకుండా మనచేత వంట చేయిస్తారు . షడ్రుచులు బ్లాగ్ ని ఇప్పుడు వెబ్సైటు ల మార్చారంటే  ఆ వంటకాల్లోంచి వచ్చే గుమగుమలు ఎలా ఉంటాయో అర్ధం చేస్కోవచ్చు . 
http://www.shadruchulu.com/telugu/
------------------------------- 

మీకు తెల్సిన వంట బ్లాగ్లను మాకు తెలియచేయండి . 

Tuesday, May 22, 2012

తోలి ప్రయత్నం

తెలుగు బ్లాగ్ గ్రూప్ కి నేను పోస్ట్ చేసిన పోస్ట్ ఇది
------------
నాదో ఆలోచన
బ్లాగ్ రచయితలకు అందరికి నమస్కారం ,మన తెలుగు బ్లాగ్ లు చాలానే ఉన్నాయ్ .. ఒక్కో బ్లాగ్ చూస్తే ఆలా రాయడం సాధ్యమేనా అనిపిస్తుంది . మరో బ్లాగ్ చూస్తే బాగారాస్తున్నారు అనిపిస్తుంది . బ్లాగ్ లపై విశ్లేషణ (reviews) ఇచ్చే బ్లాగ్ లు ఎమన్నా ఉన్నాయా ? ఈ నెలలో మంచి పోస్ట్ లు ఆదరణ పొందిన పోస్ట్ లు అని ఏ సైట్ అన్న చెప్తున్నాయ ? ఈ నెలల లో టాప్ బ్లాగ్ లు అని ఎవరైనా ప్రకటిస్తున్నారా? నాకు తెలిసి ఏవరు చేయడం లేదనుకొంటున్నాను. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ ఒక గ్రూప్ లా ఏర్పడి మన తెలుగు బ్లాగ్ లను ప్రోత్సహిస్తే బాగుంటుంది కదా అని నా ఆలోచన . అలచేయడం వాళ్ళ ఈ గ్రూప్ వాళ్ళ మెప్పు కోసం బ్లాగర్లు అందరు తమ బ్లాగ్ లకు పదును పెడతారు ..బ్లాగ్ రచయితల నుంచి మంచి పోస్ట్ లు వస్తాయి . మమోలుగా ఐతే పోస్ట్ లు రాయడం వాళ్ళకి తెల్సినా వాళ్ళు కామెంట్ లు రాయడం జరుగుతుంది .కొన్ని పోస్ట్ లకు ఒక్క కామెంట్ కూడా రాదు (నేను చాల బ్లాగ్ లు చూసాను వాళ్ళు చాల గొప్పగా రాసిన వాటికి కూడా ఒక్క కామెంట్ కూడా లేదు ), బ్లాగ్ రాసిన వారు ఆశించేది బాగుంది అనే చిన్న మాట కోసమే గా.. పెద్దలు అందరు ఒక గ్రూప్ లా ఏర్పడితే ఆ గ్రూప్ నుండి వచ్చే ప్రశంస లేదా విమర్శ బ్లాగ్ రచయితలను మరింత ఉత్సాహపరుస్తుంది . ఇప్పుడు అందరు ఒక్కో బ్లాగ్ పెట్టుకోవడం ..మీ బ్లాగ్ ని పోస్ట్ చేయండి అనడం .. అందరు పోస్ట్ చేస్తే వారు ఆడ్ లు ఇచ్చుకోవడం తప్ప జరుగుతుంది ఏం లేదు .. నేను ఎమన్నా తప్పులు రాసి ఉంటె క్షమించగలరు . నా భావాన్ని అర్ధం చేస్కుంటారు అని అనుకుంటున్నాను .
--
ఈ పోస్ట్ తరువాత గూగుల్ ప్లస్ లో పెద్దచర్చ జరిగింది. దాని ఫలితంగానే ఈ బ్లాగ్ ఏర్పడింది . మంచి బ్లాగులను అందర్కి అందించాడమే ఈ బ్లాగ్ ఉద్దేశ్యం . మీ బ్లాగ్ ని ఈ బ్లాగ్ లోకి చేర్చాలంటే  మీ బ్లాగ్ ని తగిన కేటగిరి లో సెలెక్ట్ చేస్కుని అక్కడ ఉన్న పోస్ట్ లలో మీబ్లాగ్ గురించి పరిచయం చేస్తూ కామెంట్ రాయండి లేదా వేరే బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఆ బ్లాగ్ గురించి కామెంట్ రాయండి  . మీ బ్లాగ్ ని చూసి మేము రివ్యూ చేసి ఈ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాము  . అలపోస్ట్ అయిన బ్లాగ్ లకి రివ్యూ రాయడం జరుగుతుంది భవిష్యత్ లో ప్రతి నెల ఉత్తమపోస్ట్ లను కూడా ప్రకటించడం జరుగుతుంది . ఏ విధమైన కేటగిరీలు ఉంటే బాగుంటుందో మీరే తెలిచేయండి . దేనిపై మీ స్పందన తెలియచేయండి
-------------------------------------------------------------------------------------------
పెద్దలకు నమస్కారం,
నాదో ఆలోచన అంటూ మీకు తెలియచేస్తే .. మీ అభిప్రాయాల్ని తెలియచేసినందుకు చాల సంతోషం . ముందుగా మనం మనకి నచ్చిన (అందర్కిఉపయోగపడే బ్లాగులను )  బ్లాగ్ లను పోస్ట్ చేద్దాం . ఆ తరువాత వాటి పై విశ్లేషణ కొనసాగిద్దాం . http://telugublogreviews.blogspot.in/ లో మీరు కేటగిరి లో మీకు నచ్చిన బ్లాగ్ ని కాని ,లేదా మీ బ్లాగ్ నే పరిచయం చేస్తూ కామెంట్ రూపం లో పోస్ట్ చేయండి . మీ బ్లాగ్ ( మీకు నచ్చిన ) బ్లాగ్ అందర్కి ఉపయోగ పడే బ్లాగ్ అనుకుంటే ఆ కామెంట్ ని బ్లాగ్ లో పోస్ట్ చేద్దాం . నేను చెప్పిన భావం మీకు అర్ధం అయింది అనుకుంటా!
ఉదా :
నా బ్లాగ్ లో నేను చూసిన ప్రదేశాల విషయాలను పోస్ట్ చేస్తున్నాను .. నా  బ్లాగ్ లో మీరు కంచి , రామేశ్వరం , అరుణాచలం , మహాబలిపురం వంటి ప్రదేశాలకు ఏల వెళ్ళాలి , అక్కడ చూడవాల్సినవి మొదలైన విషయాలను పొందుపరిచాను .
http://rajachandraphotos.blogspot.in/
(మా ఉద్దేశ్యం లో మంచి బ్లాగ్ లను అన్ని ఒకదగ్గరకు చేర్చాలనే ప్రయత్నం , అలాంటి బ్లాగ్ రచనలను చేసేవారని ప్రోత్సహించడం ద్వారా వారినుండి ఇంకా మంచి మంచి పోస్ట్ లను రాబట్టలానే ఈ చిరు ప్రయత్నం)