Thursday, May 31, 2012

నా బ్లాగ్

నా బ్లాగ్

నిజమే చాలామంది బ్లాగర్లు ఒకటి కంటే ఎక్కువ కేటగిరిలకు సంబందించిన విషయాలను  తమ బ్లాగ్ లలో రాస్తున్నారు .. వారికోసమే ఈ కేటగిరి మీరు ఒకటి కంటే ఎక్కువ కేటగిరిలను సంబందించిన విషయాలను  ఒకే బ్లాగ్ లో రాస్తూ ఉంటే .. మీ బ్లాగ్ కోసం ఇక్కడ పరిచయం చేయండి .

నా బ్లాగుకి హాస్యవల్లరి అని నామకరణం ఒక శ్రేయోభిలాషి చేసారు. అయితే అందులో కేవలం హాస్యమే కాకుండా ఆధ్యాత్మికం, మా ఆవిడ చేతివంటలు, నేను చూసిన ప్రదేశాలు, నేను నివసించిన ఊరు ఇలా రకరకాల విషయాలపై వ్రాయడం జరిగింది.
బ్లాగు అడ్రస్సు:
http://dvhrao.blogspot.in/
ధన్యవాదములు .
హనుమంత రావు

ప్రతిరోజు ఎన్నో విషయాలను చూస్తున్నాం. చదువుతున్నాం. వాటిలోకొన్ని మనకి ఎంతో ఆలోచనలను రేకెతిస్తాయి. ఆలాంటి ఆలోచనల సంకలనమే ఈ బ్లాగు. ' బందరు - నీ పాత పేరేమిటి? ', ' ఏడుకొందలవాడా ఎవరయ్యా నువ్వు? ' లాంటి పోష్టులే కాక సంగీతపరమైనవి, ఆధ్యాత్మ పరమైనవీ సాహిత్యపరమైనవీ కూడా ఈ బ్లాగులో ఉన్నాయి.

బ్లాగు అడ్రస్సు:
http://alochanantarangalu.blogspot.in/
ధన్యవాదములు .
సుబ్రహ్మణ్యం


కుసింత వ్యంగ్యం, కుసింత కామెడీ,కాసిన్ని జ్ఞాపకాలు, అప్పుడప్పుడు పేరడీలు,తవికలు,ఇంకా బోలెడన్ని ఆడియోలు (కీర్తనలు, కాస్త అరుదైన కలెక్షన్లు) కలిపిన బ్లాగ్ ఇది :)
బ్లాగు అడ్రస్సు:
http://blogavadgeetha.blogspot.in/
ధన్యవాదములు .
శంకర్ .


హాయ్ !ఒకసారి ఇటువైపు వచ్చి వెళ్ళండి.
నేనేనండీ..వనజ వనమాలి.
నా బ్లాగ్ లో వాస్తవం 90 % అయితే 10 % నా పైత్యం జత కూర్చి కథ అయినా కవిత అయినా, వ్యాసం అయినా,.. మనసు చెప్పినట్టే మరో ముసుగు లేకుండా చెప్పేస్తాను.
ఇక పాటలు గురించి చెప్పనిదే..నాకు నిద్ర పట్టదు.అప్పుడప్పుడు సరదాగా కొన్ని కబుర్లుతో.. బ్లాగింగ్ అనే వ్యసనాన్ని సీరియస్ గా కొనసాగిస్తున్నాను.
నా బ్లాగ్ చూడండి..నచ్చితే మళ్ళీ మళ్ళీ చూడండి.
బ్లాగు అడ్రస్సు: 
http://vanajavanamali.blogspot.in
ధన్యవాదములు .
వనజవనమాలి

సుస్వాగతం.నా బ్లాగ్ గూర్చి చెప్పాలి అంటే ఏమి లేదు . ఇది నా ప్రపంచం...నేను చూసినవి,నాకు నచ్చినవి,
మీకు ఉపయోగపడుతాయి అనుకున్నవి...సహృదయులైన మీరే వచ్చి చోసి చెప్పండి...నా భావాలు,సంతోషాలు పంచుకోండి .
http://itissasiworld.blogspot.in
శశి కళ

Monday, May 28, 2012

బ్లాగు పాఠములు

బ్లాగు పాఠములు
కొత్తగా బ్లాగ్ ప్రారంభించే  వాళ్ళకి ఉపయోగ పడే విధంగా .. పాత వాళ్ళకి కొత్తవిషములు  చెప్పే విధంగా రచనలు  చేస్తున్నా  బ్లాగ్ లను పరిచయం చేయండి 

యాత్ర విశేషాలు

యాత్ర విశేషాలు 

యాత్రావిశేషాలు తెలియచేసే బ్లాగ్ లలో మొదటిగా చెప్పుకోవాల్సింది ..  PSM లక్ష్మి గారి బ్లాగ్ ... ఈ బ్లాగ్ చూస్తే మీరు మన ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక , తమిళనాడు తో పాటు కాశీ గురించి పూర్తిసమచారం దొరుకుతుంది . లక్ష్మి గారి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే  లక్ష్మి గారు   నల్గొండ జిల్లాలోని పుణ్యక్షేత్రాలు గురించి రాసిన  యాత్రా దర్శని పుస్తకం  కినిగె వారు రిలీజ్ చేశారు.

http://4psmlakshmi.blogspot.in/

ఉత్తర భారతదేశ యాత్ర విశేషాలు తెల్సుకోవాలంటే  .. సుజాత గారి బ్లాగ్ మనం చూడాలి .. పంచద్వారకాయాత్ర ,మాతృ గయ, అబూ పర్వతం, రుక్మిణీదేవి మందిరం విశేషాలను సుజాతగారు చాల చక్కగా వివరిస్తున్నారు.   మనలో చాల మంది చూడని ఈ ప్రదేశాలు మనకందర్కి తెలియచేస్తున్నా సుజాత గార్ని అభినందిచావాల్సిందే .

http://sujathathummapudi.blogspot.in/


 నా బ్లాగ్ కోసం నేనే రాస్కోవడం అంతగా బాగోదేమో .. బహుశా అందుకే అనుకుంటాను వనజవనమాలి గారు కామెంట్ పోస్ట్ చేసారు ..
"మన భారత దేశం లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రములని పరిచయం చేస్తూ..ఆసక్తికర మైన విశేషాలతో.. మనని మనం ఉన్నచోటు నుండే దర్శింపజేసే బ్లాగ్ ఒకటి నేను చూడటం జరిగింది. ఆ బ్లాగ్ చాలా బాగుంది. తెలుగు బ్లాగులలో ఆ బ్లాగ్ పరిచయం చేయండి. నా బ్లాగ్ లింక్ ఇక్కడ ఉంది."

http://rajachandraphotos.blogspot.in/



కొత్త ప్రదేశాలను పరిచయం చేస్తూ.. అక్కడ విశేషాలను వివరించే బ్లాగ్ లను పరిచయం చేయండి 



సామెతలు

సామెతలు
మన తెలుగులో సామెతలకి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. నానుడి, సామెత, అనేవి ప్రతివాడు ఎప్పుడో ఒక్కసారైనా వాడుతూనే ఉంటాడు. అలాటి సామెతలు ప్రదేశాన్ని బట్టి, వాడుక భషను బట్టి, అక్కడి పరిస్తితులనుబట్టి ఏర్పడినవి. వీటిలో ఎంతో అనుభవం మీద చెప్పిన చక్కని సత్యాలు చిన్ని మాటలలో అందరికి అర్థం అయ్యెట్టుగా ఉంటాయి. అటువంటి సామెతలను మన తెలుగు వారికి అందుబాటులోకి తేవటాని ఒకచోట చేర్చాను. ప్రస్తుతానికి 9325 వరకూ ఒకచోట ఉన్నాయి. మరికొన్ని మిత్రులు నాతో పంచుకొన్నవి చేర్చే పని మిగిలి ఉంది. ఈ సామెతలు అందరికి ఉపయోగకరంగా అందుబాటులోనికి వచ్చేటట్లుగా మీ లిష్టులో చేర్చవలసింది.
నా బ్లాగు అడ్రస్సు
http://dsubrahmanyam.blogspot.in/
ధన్యవాదములు
సుబ్రహ్మణ్యం


సామెతలతో రచనలు చేస్తున్న బ్లాగ్ లను పరిచయం చేయండి 

ప్రముఖుల పరిచయం

ప్రముఖుల పరిచయం
ప్రముఖ వ్యక్తులను పరిచయం చేస్తూ .. గొప్ప  వాళ్ళ జీవిత చరిత్రలను  రచనలు చేస్తున్న బ్లాగ్ లను పరిచయం చేయండి 

కథలు

కథలు 


 చక్కటి రచనతో  ఆసక్తిగా సాగే కధనంతో .. రచనలు చేస్తున్నా  బ్లాగ్ లను పరిచయం చేయండి .

పద్యాలు

పద్యాలు
మీకు పరిచయం ఉన్న పద్యాలు లకు సంబంధించిన బ్లాగ్ లను పరిచయం చేయండి .

స్పోకెన్ ఇంగ్లీష్

స్పోకెన్ ఇంగ్లీష్ 
తెలుగు మనకు 'అమ్మ'- ఇంగ్లిష్ మనకు 'నేస్తం' జీవితం లో ఎదగడానికి ఇద్దరూ అవసరమే..మనమందరమూ ఇంగ్లీష్  నేర్చుకునే ప్రయత్నం చేద్దాం  అంటారు ప్రతాప్ గారు ,  భాష కోసం చెప్తూ  భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది.ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు.కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు చెందుతూ ఉంటుంది అని చెప్తారు ..  ఒక్క ఇంగ్లీష్ ఒకటే కాదు నేటి యువతరం కోసం ముఖ్యంగా  నిరుద్యోగ మిత్రులకు కోసం "JOB SEARCH" ఓ క్రొత్త పేజీ ప్రారంభించారు . Social Responsibilities కోసం శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు చెప్పిన ప్రవచాన్ని వినమని అనకుండా .. "ఇక్కడ క్లిక్ చేసి శ్రీ కోటేశ్వరరావు గారి మధుర వచనం వినండి.ప్లీజ్.. ..1 గంట.21 నిమిషాలు దేవునికి నివేదనగా భావించి శ్రద్దగా వినమని ప్రార్ధిస్తున్నాను... -- మీ ప్రతాప్" అంటారాయన . ఒక్కసారి ప్రతాప్ గారి బ్లాగ్ చూసి ఆయన చేస్తున్న కృషిని అభినందిచి రండి .
http://tellenglish.blogspot.in/


మీకు తెల్సిన స్పోకెన్ ఇంగ్లీష్ బ్లాగ్ లను పరిచయం చేయండి . 

ఇతిహాసములు

ఇతిహాసములు



మీ బ్లాగ్ లేదా మీకు తెల్సిన బ్లాగ్ లలో ఇతిహాసములు లకు సంబంధినిన విశేషాలు ఉంటే మాకు పరిచయం చేయండి

సోమవారము సాధకుడు సత్సంగము


ఒకనాడు బుద్ధ భగవానుడు  తన  శిష్యునికి  దగ్గరగా  ఉన్న  చేరువునుంచిమంచినీరు  తెమ్మని  చెప్పారు,  కాని  అప్పుడే  ఒక  వరాహము (పంది)  ఆ  చెరువులో నుంచి  వెళ్ళడం  వల్ల నీరు అంతా  మురికి  అయ్యాయి, కనుక  శిష్యుడు  వట్టి  చేతులతో  తిరిగి వెనక్కు వచ్చాడు, రిక్త హస్తాలతో వచ్చిన శిష్యుణ్ణి చూసి, ఏమైందని  అడిగారు  బుద్ధ భగవానులు, జరిగినది  అంతా   శిష్యుడు చెప్పగా...  కొంత  సమయం  తరువాత  మళ్ళా  వెళ్ళమన్నారు  బుద్ధ భగవానుడు, శిష్యుడు  వెళ్లి  మళ్ళీ  వట్టి  చేతులతోనే  తిరిగి  వచ్చాడు, నీళ్ళు  ఇంకా మురికిగా  వున్నాయి  అని, మళ్ళీ  కాస్సేపటి  తరువాత  వెళ్ళ  మన్నారు. ఈ   సారి  నీళ్ళు  తేట  పడినవి, శిష్యుడు  నీళ్ళు  తెచ్చాడు బుద్ధుడు  అడిగాడు  నీళ్ళు   తేట  పడటానికి  ఏమి  చేశావు ? అని  ఏమిచేయ్యలేదు కొద్ది  సమయం  ఊరక  వున్నాను  అన్నాడు  శిష్యుడు మనో  మాలిన్యం  కూడా  అంతే !  ఉపేక్షించి  స్పందించకుండా  వుంటే  ఆలోచనలు  అవే  ఉడిగి  పోతాయి  అదే  నిర్వణమని  బోధించాడు  బుద్ధుడు  ప్రతి  సాధకుడు  చేయవలిసింది  ఇదే !!

కథ బాగుంది అనిపిస్తే మంచి వాళ్ళు, భక్తులు అన్నట్టు, అలాకాక చాలా ప్రేరనాత్మకం గా అనిపిస్తే సాధకులు అన్నట్టు, ఇంతకు ఈ కథ  సత్సంగము  అనే blog నుంచి గ్రహించటం జరిగింది, పేరుకు తగినట్లుగా ఈ blog లో సాధకులకు కావాల్సిన సర్వము లభిస్తాయి, కొన్ని సత్సంగ classes ను video ఇంకా audio రూపం లో భద్రపరచి ఉంచటం ఇందులో మనం గమనించవచ్చు, ఇంకా వీరి సత్సంగము ద్వారా ప్రచురితమైన జీవన్ ముక్తి  ప్రకాశిక  జ్ఞాన వాసిష్టము శ్రీ బ్రహ్మ విద్య,  సర్వ వేదాంత శిరోభూషణము,  వివేక చింతామణి,  ఆరాధన మంత్ర పుష్పము , ఆత్మా నాత్మ వివేక దర్శిని,  ఎరుక సంగ్రహము , నన్ను పొందుటకు ద్వాదశ మార్గాలు,  శ్రీ గురు పూజా విధానము వంటి గ్రంథములు చదువరులకు వీలుగా pdf ఫైళ్ళను download చేసే అవకాశం కలిపించారు.


మరి ఆధ్యాత్మ జిజ్ఞాసువులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించ కోరుతున్నాము. - సాయిరాం